అదానీపై జగన్ కీలక వ్యాఖ్యలు (వీడియో)

78చూసినవారు
AP: అదానీ వ్యవహారంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తాజాగా స్పందించారు. ఎఫ్‌బీఐ ఛార్జ్‌షీట్‌లో తన పేరు ఎక్కడా లేదన్నారు. ‘అదానీకి రాష్ట్రంలో చాలా కంపెనీలు ఉన్నాయి. అదానీతో భేటీకి, విద్యుత్ ఒప్పందాలకు సంబంధమే లేదు. నాకు లంచం ఆఫర్ చేసినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వాస్తవాలు తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారు. నా పరువు, ప్రతిష్టలు దెబ్బ తీసే వారిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయబోతున్నా.’ అని జగన్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్