ఏపీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

56చూసినవారు
ఏపీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఏపీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మన్యం జిల్లాలో చలి పంజా విసురుతోంది. గతేడాది నవంబర్ 10-30 తేదీల్లో 13-13.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. ఈ సారి మరో 5 డిగ్రీలు తగ్గిపోయాయి. గురువారం అరకు లోయలో 9.1, డుంబ్రిగూడలో 8.6, జి.మాడుగుల, జీకే వీధిలో 8.7, హుకుంపేటలో 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు ఇంటి నుంచి బయటికెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్