క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. శనివారం వనపర్తి జిల్లాలో క్షయ వ్యాధిని పూర్తిగా పారదోలేందుకు చేపడుతున్న 100 రోజుల కార్యక్రమాన్ని ఐడిఓసి కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డితో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ. క్షయ వ్యాధి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు.