సభ్యత్వాల నమోదులో చరిత్ర సృష్టించిన టీడీపీ
76 లక్షలకుపైగా సభ్యత్వాల నమోదుతో దేశంలోనే చరిత్ర సృష్టించామని, అందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమైందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 76,89,103 మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారన్నారు. ఇవాళ సభ్యత్వ నమోదుపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీపై నమ్మకం, విశ్వాసంతో ప్రజలు సభ్యత్వం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టీడీపికి ఉందన్నారు.