ఖైరతాబాద్ గణనాథుడికి ముగిసిన మంగళ హారతి (వీడియో)
ఖైరతాబాద్‌లోని సప్తముఖ మహా గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. అర్చకులు చివరి మంగళ హారతిని స్వామివారికి ఇచ్చారు. కాసేపట్లోనే ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాన్ని కదిలించనున్నారు. అర్ధరాత్రి భారీ గణనాథుడిని టస్కర్‌పైకి ఎక్కిస్తారు. రేపు ఉదయం 6 గంటలకు శోభ యాత్ర ప్రారంభంకానుంది. మంగళవారం మధ్యాహ్నంలోపు వినాయకుడిని గంగమ్మ చెంతకు చేర్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.