సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఫెర్రీ బోటు ప్రమాదం
ముంబై తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి కారణం ఫెర్రీ బోటు సిబ్బంది నిర్లక్ష్యమే అని అధికారులు వెల్లడించారు. బోటులో సరిపడా లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది వాటిని ధరించలేదన్నారు. అలాగే ప్రమాదం జరిగే ముందు రక్షణ చర్యలు కూడా చేపట్టలేదని పేర్కొన్నారు.