కొలికపూడికి టీడీపీ క్రమశిక్షణ కమిటీ హెచ్చరిక
AP: ‘వరుస వివాదాలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. మీ తీరు పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మీ చర్యలు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. అమరావతి కోసం మీరు పోరాడిన తీరు చూసి పార్టీ టికెట్ ఇచ్చింది. పార్టీ శ్రేణులు మిమ్మల్ని గెలిపించాయి. కానీ మీరు మాత్రం రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు.’ అని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ క్రమశిక్షణ కమిటీ హెచ్చరించింది.