అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తొలి ప్రసంగంలో సంచలన ప్రకటన చేశారు. అమెరికా దక్షిణ సరిహద్దులో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ‘‘దక్షిణ సరిహద్దుల్లో మరిన్ని బలగాలను మోహరిస్తాం.. అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తాం.. విదేశీ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపుతాం’’ అంటూ ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. ప్రపంచంలో ఎవరూ ఊహించని విధంగా అమెరికా సైన్యాన్ని తయారు చేస్తామని ట్రంప్ అన్నారు.