AP: వికలాంగుల పెన్షనర్లలో అనర్హుల ఏరివేతకు ప్రభుత్వం సిద్ధమైంది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు, చేతులు దెబ్బతినడంతో రూ.6వేలు పెన్షన్ పొందుతున్నవారికి రెండు రోజుల్లో వైద్య పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది. రాష్ట్రంలో చేపట్టిన సర్వేలో సుమారు 7 లక్షల మంది లబ్ధిదారుల్లో 40 శాతం అనర్హులు ఉండొచ్చని తేలింది. అవయవాలు బాగానే ఉన్నా ఫేక్ సర్టిఫికెట్లతో ఇన్నాళ్లూ డబ్బులు తీసుకున్నవారి పెన్షన్ కట్ కానుంది.