మహారాష్ట్ర సీఎం పడ్నవీస్ భార్య బాలీవుడ్లో స్టార్ సింగర్
ఇటీవల మహారాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్‌కు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే.. అమృతా సీఎం భార్యగానే కాదు తన టాలెంట్‌తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్‌గా తనకు మంచి గుర్తింపు ఉంది. అమృత మొదటి మ్యూజిక్ వీడియో ఫిర్ సేకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. వీటితో పాటు ముంబయి రివర్ యాంథెమ్, ముంబై-పోయిసర్, దహిసర్, ఓషివారా అనే పాటలు కూడా పాడింది.