వైసీపీకి మరో బిగ్‌షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. మాజీ హోం మంత్రి, కీలక నేత మేకతోటి సుచరిత వైసీపీకి గుడ్‌బై చెప్పనున్నారని సమాచారం. గత ఎన్నికల్లో సుచరిత భర్తకు బాపట్ల ఎంపీ టికెట్, సుచరితకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో పాటు ప్రత్తిపాడు బాధ్యతలను వైసీపీ అధిష్టానం వేరొకరికి అప్పగించడం వంటి విషయాలతో సుచరిత తీవ్ర మనస్థాపం చెందారని టాక్. దీంతో ఆమె త్వరలో టీడీపీ లేదా జనసేనలో చేరతారని ప్రచారం మొదలైంది.