AP: వచ్చే ఏడాది మార్చిలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షల సన్నద్ధత కోసం ఆదివారాలు, ఇతర సెలవుల్లోనూ క్లాసులు నిర్వహించాలని యాక్షన్ ప్లాన్‌లో పాఠశాలలకు విద్యాశాఖ సూచించింది. దీంతో టెన్త్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులను 3 రోజులకు కుదించే అవకాశం ఉంది. సాధారణంగా సంక్రాంతికి దాదాపు 2 వారాలపాటు సెలవులు ఉంటాయి.