చెత్త పన్ను రద్దు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
చెత్త పన్ను రద్దు చేస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. బుధవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. ఏడాదిలోగా ఈ చెత్తను ఎత్తేయాలని మంత్రి నారాయణకు సూచించాం. చెత్త ఎత్తుతున్నామంటూ గత చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేసింది. చెత్తపై పన్ను రద్దు చేస్తున్నాం. బందరు కాలేజీని పింగళి వెంకయ్య పేరు పెడతాం.’ అని అన్నారు.