ఏపీకి రూ.100 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2027లో జరిగే గోదావరి పుష్కరాల కోసం రూ.100 కోట్ల నిధులను విడుదల చేసింది. పుష్కరాల నేపథ్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు ఈ రూ.100 కోట్లను కేటాయించారు. దీంతో రాష్ట్రంలోని పర్యాటక శాఖ అధికారులు పుష్కరాల పనులను త్వరలోనే ప్రారంభించనున్నారు.