ఏపీలో అంతుచిక్కని వైరస్..లక్షల్లో కోళ్లు మృతి

75చూసినవారు
ఏపీలో అంతుచిక్కని వైరస్..లక్షల్లో కోళ్లు మృతి
AP: పశ్చిమ గోదావరి జిల్లాల్లో అంతుచిక్కని వైరస్‌తో కోళ్లు లక్షల్లో మృతువాత పడుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు సైతం గంటల వ్యవధిలో మృతి చెందుతున్నాయి. వీటిలో ఎక్కువగా పందెం కోసం పెంచిన కోళ్లల్లో ఈ వైరస్ లక్షణాలు  కనిపిస్తున్నాయట. దీంతో చికెన్ తినేవారికి సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వైరస్ సోకిన కోళ్లు తినడం వల్ల మనుషులు కూడా చనిపోయే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్