Nov 23, 2024, 14:11 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
నాగర్ కర్నూలు: సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే వేగవంతం చేయాలి
Nov 23, 2024, 14:11 IST
గ్రామాల్లో, మున్సిపాలిటీలలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో శనివారం కలెక్టర్ వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లు, సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేపై ఆర్డివోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష జరిపారు. కేంద్రాలలో అవసరమైనన్ని టార్పాలిన్, ప్యాడి క్లీనర్స్, డిజిటల్ మెకో మీటరు అవసరాలపై చర్చించారు.