ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రాంతాలలో సోలాపూర్ ఒకటి. సోలాపూర్‌లో
బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతే విజయం సాధించడంతో మీడియాతో మాట్లాడారు. 'నేను పవన్ కళ్యాణ్ వల్లే ఎన్నికలలో గెలిచాను. మీ ప్రసంగాలతో మహారాష్ట్ర, సోలాపూర్ ప్రజలను మీరు ప్రభావితం చేశారు. మీ ప్రభావం చాలా ఉంది ఇక్కడ' అంటూ ఆయన పవన్‌కు ధన్యవాదాలు తెలిపారు.