Top 10 viral news 🔥
గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయి: ఏపీ డీజీపీ
AP: గత ప్రభుత్వ హయాంలో కొన్ని తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దడంపై దృష్టి పెట్టినట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. రాష్ట్రంలో మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండేలా పోలీసు వ్యవస్థలో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఐజీ సంజయ్‌పై వచ్చిన ఆరోపణలను సైతం ప్రభుత్వం విచారణ చేయిస్తోందన్నారు.