డయేరియాతో నాలుగేళ్ల చిన్నారి మృతి
ఏపీలోని విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని జబ్బర్ తోటలో డయేరియా వేగంగా విజృంభిస్తోంది. గత ఐదు రోజుల్లోనే 40-50 మంది డయేరియా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు అప్రమత్తమై మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. తాజాగా డయేరియా బారిన పడిన నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.