Top 10 viral news 🔥
పాఠాలు చెబుతూ క్లాస్ రూమ్‌లోనే గుండెపోటుతో టీచర్ మృతి
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇల్లెందులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని క్లాస్ రూమ్‌లో పాఠాలు బోధిస్తున్న పిల్లి రమేశ్(44) అనే ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో గమనించిన తోటి ఉపాధ్యాయులు ఆయన్ను హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే రమేశ్ గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు.