AP: గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో గ్రామ పంచాయతీల క్లస్టర్ గ్రేడ్ల విభజనపై సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. పంచాయతీల క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానానికి ఇకపై నూతన ప్రాతిపదికగా జనాభాను కూడా తీసుకోవాలని సూచించారు.