నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం మారం కృష్ణమూర్తి మృతి బాధాకరం అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బీళ్యా నాయక్ సోమవారం అన్నారు. మారం కృష్ణమూర్తి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. మారం కృష్ణమూర్తి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.