నేను రచ్చ గెలిచి.. ఇంట గెలిచాను : చిరంజీవి
‘‘తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. నా విషయంలో రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను ఏమో అనిపిస్తోంది‘ అని సినీ నటుడు చిరంజీవి అన్నారు. మా నాన్నకు నటన అంటే చాలా ఇష్టం. అలాంటి మా నాన్న నన్ను ఎందుకు పొగడరు అనిపించేది. ఓ రోజు అమ్మ దగ్గరకు వెళ్లి.. ‘ఏంటమ్మా నాన్న ఎప్పుడూ నా గురించి ఓ మాట అనరు, బాగుందని కూడా చెప్పరు’ అని అడిగాను. ‘బిడ్డల్ని తల్లిదండ్రుల్ని పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం’’ అని అమ్మ చెప్పింది అని చిరు తెలిపారు.