TG: కేంద్రమంత్రి బండి సంజయ్కు మాజీ మంత్రి హరీశ్ రావు ఫైరయ్యారు. సోమావారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందా? ఆర్ఎస్ బ్రదర్స్ ప్రభుత్వం నడుస్తోందా? అని ప్రశ్నించారు. బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళనలు చేస్తుంటే.. కేంద్ర సహాయ మంత్రిగా ఉండి మీరు ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కానిస్టేబుళ్లు రోడ్డెక్కితే.. వారిని కాపాడకుండా ఏం చేస్తున్నారని అన్నారు.