మర్రిగూడ: కొనసాగుతున్న ఫ్లోరోసిస్‌ సర్వే

60చూసినవారు
మర్రిగూడ: కొనసాగుతున్న ఫ్లోరోసిస్‌ సర్వే
మర్రిగూడ మండల కేంద్రంలో కొనసాగుతున్న ఫ్లోరోసిస్‌ సర్వేను శుక్రవారం మర్రిగూడ పీహెచ్‌సీ వైద్యాధికారి శాలిని, వైద్యుడు దీపక్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా పలువురు ఫ్లోరోసిస్‌ బాధితులను పరీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి వరకు 18, 134 మందిని పరీక్షించామన్నారు. 79 మంది గర్భిణుల్లో 20 మంది నుంచి యూరిన్‌ శాంపిళ్లు సేకరించామని తెలిపారు. వారి వెంట ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్