అవయవదానం: విజయవాడకు కాలేయం.. చెన్నైకు గుండె..

62చూసినవారు
అవయవదానం: విజయవాడకు కాలేయం.. చెన్నైకు గుండె..
AP: శ్రీకాకుళం జిల్లా మందనకు చెందిన విద్యుత్ లైన్‌మెన్ కొంకి జోగారావు (30) ఈ నెల 25న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మరణించినా అవయవదానం చేసి చిరంజీవిగా నిలిచారు. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు అవయవదానం చేశారు. శ్రీకాకుళం నగరంలోని మెడికవర్ ఆస్పత్రి నుంచి గ్రీన్ చానల్ ద్వారా మృతదేహాన్ని విశాఖ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. గుండెను చెన్నైకు, లివర్‌ను విజయవాడకు, కిడ్నీలు విశాఖపట్నంలో అవసరమైన రోగులకు అందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్