175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు
ఏపీ చరిత్రలో తొలిసారి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటి అభివృద్ధికి ముందుకు వచ్చేవారికి తగిన ప్రోత్సాహకాలు అందించే పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రైవేట్ పరిశ్రమల పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమలకు అవసరమయ్యే స్టోరేజీ, ఉత్పత్తులకు అనువైన స్థలం, రవాణ సదుపాయం వంటి మౌలిక సదుపాయాలను ఈ పార్కుల్లో కల్పిస్తారు.