నార్కట్ పల్లి: ఉదయ సముద్రం ప్రాజెక్టులో వ్యక్తి గల్లంతు
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు లో శనివారం గుండాల శంకరయ్య అనే వ్యక్తి ఈత కొడుతూ గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అప్పాజిపేట గ్రామానికి చెందిన వ్యక్తి నేరడ గ్రామానికి చెందిన బంధువుల ఇంటికి దీపావళి పండగకు వచ్చాడు. ప్రాజెక్టు లోకి నీరు వదలడంతో చూడటానికి వెళ్ళిన అతను లోపలికి వెళ్ళి ఈత కొడుతూ గల్లంతయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.