
చిట్యాల: బస్సు యాత్రను జయప్రదం చేయాలి
చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం ఆశాల బస్సు యాత్ర (సిఐటియు) వాల్ పోస్టర్స్, కరపత్రాలను సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ యూనియన్ వారితో కలిసి విడుదల చేశారు. ఆశాల సమస్యల పరిష్కారం కోసం జరిగే ఆశాల రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర బుధవారం నల్గొండకు విచ్చేస్తున్నందున జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశాలందరూ పాల్గొని బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరారు.