పవన్ కళ్యాణ్‌పై కేతిరెడ్డి సెటైర్లు (వీడియో)
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెటైర్లు వేశారు. ‘కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు లభించలేదు. ప్రజలపై అదనపు విద్యుత్ భారం మోపుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తానని పవన్ చెప్పారు. ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారు.’ అని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.