నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. పొగిళ్ల గ్రామంలో ఎలుగుబంటి సంచరిస్తోందని గ్రామస్థులు తెలిపారు. తమ గ్రామానికి దగ్గర్లో అటవీ ప్రాంతం ఉండటంతో ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చిందని అంటున్నారు. రాత్రి సమయంలో వీధులగుండా తిరుగుతున్న ఎలుగుబంటిని కొందరు యువకులు వీడియో తీశారు.