నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సహంగా సంతోషంగా వేడుకలు నిర్వహించారు. హోలీ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి రంగుల పండుగ సంతోషం కలగాలని జిల్లా ఎస్పీ తెలిపారు.