ఆదివారం నుండి ప్రారంభం కానున్న చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరోసారి ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, సంబంధిత అధికారులతో కలిసి చెరువుగట్టును సందర్శించారు. ఇదివరకే చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులకు దిశా నిదర్శనం చేశారు.