నల్లగొండ: మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన

62చూసినవారు
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వైస్ చాన్స్‌లర్‌ను తొలగించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే. సోమవారం నల్లగొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. వీసీ కార్యాలయం ఎదుట డప్పుల చప్పుడుతో పెద్ద ఎత్తున మూడు గంటల పాటు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీసీ నియంతృత్వ నిర్ణయాల వల్ల విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.