గుడిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు మారం కృష్ణమూర్తి మృతి బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం మారం కృష్ణమూర్తి మృత దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణమూర్తి కుటుంబ సభ్యులకు ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణమూర్తి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థించారు.