నల్గొండ పట్టణ మున్సిపాలిటీ వర్కర్లు గురువారం ఉదయం తెల్లవారుజామున ధర్నా చేపట్టారు. రెండు నెలలకు సంబంధించిన జీతాలు, 9 నెలల ఏరియర్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సలీం మాట్లాడుతూ అధికారులు స్పందించి మున్సిపాలిటీ కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు.