గ్రామపంచాయతీ ఎన్నికలలో రిటర్నింగ్ అధికారులు స్టేజి -1, 2 అధికారులది కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆదిత్య భవన్లో గ్రామపంచాయతీ ఎన్నికల స్టేజి వన్, స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.