Oct 29, 2024, 11:10 IST/
రన్నింగ్ ట్రైన్ నుంచి దూకాడు.. కొంచెంలో ప్రాణాలు పోయేవి (వీడియో)
Oct 29, 2024, 11:10 IST
కదులుతున్న రైలులో నుంచి కిందికి దిగాలని ప్రయత్నించిన ఓ యువకుడు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. ఓ రైలు వెళుతుండగా అందులోంచి ఓ యువకుడు సడెన్గా కిందికి దిగాడు. అయితే, దిగే క్రమంలో అదుపుతప్పడంతో కింద పడిపోయాడు. రైలు, ఫ్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కుపోతుండగా తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి అతడిని పక్కకి లాగారు. దీంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.