ఆ రోజు అమితాబ్ మాటలు విన్నాక.. నా నోట మాట రాలేదు: చిరంజీవి
‘‘నా గురువు, నా మెంటార్, నా స్ఫూర్తిదాత అమితాబ్ బచ్చన్‌కు ముందుగా ధన్యవాదాలు. ఆయన లాంటి బిగ్ స్టార్ నాకు ఈ అవార్డు ప్రదానం చేయడం ఆనందదాయకం’ అని చిరంజీవి అన్నారు. చిరు మాట్లాడుతూ పద్మ భూషణ్ వచ్చినప్పుడు అమితాబ్ మాట్లాడుతూ ‘చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని చెప్పారు. అమితాబ్ బచ్చన్ నోటి నుంచి ఆ మాటలు రావడం అంటే ఎంత పెద్ద విషయమో కదా. ఆయన మాటలు నన్ను ఎంతో ప్రోత్సాహం ఇచ్చాయి. ఆయన మాటలు నాకు ఎంతో విలువైనవి’’ అని చెప్పారు.