బాసర రైల్వేస్టేషన్‌లో బుధవారం రాత్రి నాందేడ్-విశాఖపట్నం వెళ్లే రైలు ఎక్కడానికి ప్రయత్నించి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారి పడి తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే పోలీసులు వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స చేయించి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. గాయాలైన వ్యక్తి దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు.