AP: పాలకొల్లుకు చెందిన శిరీష(34) అస్వస్థతకు గురికావడంతో డయాలసిస్ కోసం కాకినాడ జీజీహెచ్లో చేర్చారు. అయితే ఆమెకు రక్తం ఎక్కించగా కాసేపటికే పరిస్థితి విషమించింది. O పాజిటివ్ బదులు AB పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కించినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం మృతి చెందింది. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ.3 లక్షల చెక్కును పరిహారంగా అందించారు. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది.