సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని ముథోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అన్నారు. బుధవారం బైంసా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీఎం సహాయనిది చెక్కులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ ఛార్జ్ మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.