

బాసర: హామీలను అమలు చేయాలని ఆటో ర్యాలీ
ఆటో ఆకలి కేకలు మహాసభ కార్యక్రమంలో భాగంగా ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ పిలుపు మేరకు బాసర మండల కేంద్రంలో ఆటోవాలాలు రైల్వే స్టేషన్ నుంచి ఆలయం మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 2023 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆటో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మే 27న హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాసభను విజయవంతం చేయాలని కోరారు.