ఆర్మూర్: ఘనంగా భీమన్న పండుగ ఉత్సవాలు
ఆర్మూర్ మండలం సర్బిర్యల్ గ్రామంలో గురువారం భీమన్న పండుగను ఘనంగా నిర్వహించారు. పండుగలో భాగంగా గంగ నది స్నానం అనంతరం తీసుకువచ్చిన భీమన్న గజాలను వాడవాడకు తిరుగుతూ ఊరేగింపు ఘనంగా జరిపారు. ఆదివాసి నాయక్ పోడ్ ల ఆరాధ్య దైవం భీమన్న పండుగను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.