ఆర్మూర్: వీధికుక్కల వీరంగం.. 11 మంది చిన్నారులపై దాడి
ఆర్మూర్ మున్సిపల్ లోని 36 వార్డుతో పాటు హుస్నాబాద్, గోల్ బంగ్లా కాలనీల్లో వీధి కుక్కలు 11 మంది చిన్నారులపై దాడి చేసి గాయపరిచాయి. వీధి కుక్కలు వీరంగం సృష్టించి గాయాల పాలు చేయడంతో ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులు చికిత్సలు తీసుకున్నారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని శుక్రవారం స్థానిక ప్రజలు కోరుతున్నారు.