

మా పార్టీ నుంచి అభ్యర్థిని పెట్టలేదు.. వారికి ఓటు వేయండి: MLC కవిత (వీడియో)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిని పెట్టలేదని MLC కవిత పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు వేయకుండా ఇండిపెండెంట్లలో మంచి బీసీ బిడ్డలకు ఓటు వేయండని కవిత పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబీయా పట్టుకుందని ఆమె అన్నారు. మైక్ పట్టుకుంటే కేసీఆర్ను తిట్టాలని ఫోబీయా పట్టుకుందని కవిత విమర్శించారు. సీఎం తెల్లారి లేస్తే సమస్యలు పక్కన పెట్టి పాలిటిక్స్ చేస్తారన్నారు.