చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లను బీజేపీ కాపాడుతోందంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సోమవారం ఆయన స్పందించారు. 'ట్యాపింగ్ కేసులో సమగ్రంగా విచారణ జరపాలని బీజేపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. సీబీఐకి ఈ కేసును అప్పగిస్తే విచారణ ముందుకెళ్తుంది. రేవంత్‌లా నేను పార్టీలు మారలేదు.' అని కిషన్ రెడ్డి అన్నారు.