రైతులందరికీ రుణమాఫీ చేసి తీరాలి
రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని వేల్పూర్ మండల్ బిఆర్ఎస్ అధ్యక్షుడు జెడి నాగరెడ్డి మంగళవారం డిమండ్ చేశారు. వేల్పూర్ మండలంలో ఇప్పటివరకు 2, 632 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది, ఇంకా 8584 మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంది. వారికి కూడా రుణమాఫీ జరగాలి లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.