Sep 22, 2024, 01:09 IST/
పురుగులు పట్టిన బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (వీడియో)
Sep 22, 2024, 01:09 IST
విద్యార్థులు తినే మధ్యాహ్న భోజనంలో పురుగులు పట్టిన బియ్యాన్ని వండుతున్న ఘటన తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. గుండుమాల్ మండలంలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం వడ్డిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిపారు. స్థానికులు వంట గదిలోకి వెళ్లి పరిశీలించగా ముక్కిపోయిన బియ్యం, చిట్టేలు కట్టిన బియ్యం దర్శనమిచ్చాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన బియ్యాన్ని అందించి మధ్యాహ్న భోజనం సరిగ్గా ఉండేటట్లు చూడాలని కోరారు.