కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం సొమ్మసిల్లి పడిపోయారు. CWC సమావేశాల కోసం గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమానికి ఆయన వెళ్లారు. అయితే డీహైడ్రేషన్ వల్ల ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పార్టీ కార్యకర్తలు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆయనను పార్టీ కార్యకర్తలు ఆసుపత్రికి తరలిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.